
మెడ్యునైటెడ్ హాస్పిటల్స్ లో మహిళా దినోత్సవ వేడుక
మెడ్ యునైటెడ్ హాస్పిటల్స్ అమలాపురంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించారు. మహిళల శక్తి, సామర్థ్యం, సమానత్వంతో పాటు వారి ఆరోగ్య ప్రాధాన్యతలను గుర్తు చేస్తూ వేడుకలు జరిగాయి. ఈ మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వాకథాన్ స్ఫూర్తిదాయకంగా సాగింది. దాదాపు 200 మందికి పైగా మహిళలు ఈ వాకథాన్ లో పాల్గొనడం ఎంతో ఆనందాన్ని కలిగించింది.
ఈ వేడుక కేవలం మహిళా దినోత్సవం అనే ఉద్దేశంతోనే కాకుండా.. వారి శక్తి, ఆరోగ్యం మరియు సమానత్వాలను బయటపెట్టే గొప్ప ప్రదర్శనగా వాకథాన్ జరిగిందని గర్వంగా చెప్పగలము. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మహిళల విజయాల కొరకు కొనసాగుతున్న పోరాటాలను గుర్తుచేసే విధంగా.. ఈ వాకథాన్ ఒక ఉదాహరణగా నిలిచింది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
మహిళా శక్తి, ఐక్యత కోసం ఒక రోజు!
మెడ్ యునైటెడ్ హాస్పిటల్స్ వారు నిర్వహించిన వాకథాన్.. మహిళల ఆరోగ్యం, శక్తి సామర్థ్యాలను అన్ని వయసుల వారిలోను ప్రేరేపించే ఉద్దేశంతో నిర్వహించడం జరిగింది. కేవలం శారీరక శ్రమనే కాదు.. సమానత్వంలోను ప్రోత్సాహం అందించాలని, మారుతున్న ప్రపంచంలో మహిళల ఎదుగుదలను గుర్తించాలనే దిశగా ఈ వాకథాన్ సాగింది. ఈ వాకథాన్ లో పాల్గొన్న 200 మంది మహిళలు.. రేపటి భవిష్యత్తుకు, ముందు తరాలకు స్ఫూర్తిని అందించారు.
ఇక ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అతిథులు.. ఈ వేడుకను మర్చిపోలేని విధంగా మార్చారు.
- ఆర్డిఓ మాధవి, సమాజంలో మహిళల పాత్ర గురించి ఆమె తన ఆలోచనలను పంచుకున్నారు.
- డాక్టర్ అయ్యగారి రాధిక, సీనియర్ గైనకాలజిస్ట్, మహిళల ఆరోగ్యం మరియు సంక్షేమం గురించి విలువైన సూచనలను అందించారు.
- సిహెచ్. ఉషా రాణి, సీనియర్ యోగా శిక్షకురాలు, శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని కాపాడడంలో యోగా పాత్రను పంచుకున్నారు.
- శ్రీమతి యెండూరి రాఘవ, (వాసవి క్లబ్ జిల్లా గవర్నర్), మహిళల హక్కుల కోసం పోరాటాన్ని గుర్తుచేశారు.
- పేరి లలిత, మహిళా మండల అధ్యక్షురాలు, సమాజంలో మహిళలకు కావాల్సిన మద్దతు గురించి మాట్లాడారు.
- శ్రీమతి రమా తులసి, మహిళా వాకర్స్ క్లబ్ అధ్యక్షురాలు, సమాజంలో మహిళా శక్తి యొక్క ప్రాధాన్యతని చర్చించారు.
- శ్రీమతి సత్య నాగేంద్ర మణి, పట్టణ చైర్ పర్సన్, మహిళల నాయకత్వ లక్షణాలను, శక్తిని వివరించారు.
మహిళల ఆరోగ్యానికి పెద్దపీట!
మహిళా దినోత్సవం సందర్భంగా మెడ్యునైటెడ్ హాస్పిటల్స్ నిర్వహించిన ‘వాకథాన్’ కేవలం ఒక ఫిజికల్ ఈవెంట్ మాత్రమే కాదు. రోజువారీ జీవితంలో మహిళల ఆరోగ్యం మరియు ఐక్యతను ప్రతిబింబిస్తుంది. అదే విధంగా మహిళల పట్ల పురుషులు చూపవలసిన గౌరవ మర్యాదలు, బాధ్యతలు మరియు మద్దతును సైతం ఈ మహిళా దినోత్సవం గుర్తుచేస్తుంది.