
అంబాజీపేట మెడ్ యునైటెడ్ ఉచిత మెగా మెడికల్ క్యాంపు
సినీ తారలకు అభిమానులు ఉండటం అనేది సాధారణ విషయమే. కొంతమంది వాళ్ళను సినిమాల వరకు అభిమానిస్తారు. మరికొందరు సినిమాలతో పాటు వారి సామాజిక జీవితంలో కూడా అభిమానం చాటుతూ ఉంటారు. అందుకే అభిమాన నటులకు సంబంధించి స్పెషల్ డేస్ ఏం ఉన్నా.. వాటిని ఎవరి ఏరియాలో వారు ఘనంగా సెలెబ్రేట్ చేసుకుంటారు. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా మార్చి 27న, అంబాజీపేటలోని కేవీ పాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎదురుగా ఉన్న కమిటి హాల్ నందు మెగా అభిమానులు ఉచిత మెగా మెడికల్ క్యాంపు నిర్వహించారు.
ఈ క్యాంపులో పాల్గొన్న మెడ్ యునైటెడ్ వైద్యులు
డా. అశోక్ కుమార్ (జనరల్ మెడిసిన్)
డా. రాఘవ (పీడియాట్రిక్)
డా. మల్లిక (దంత వైద్యులు)
డా. సందీప్ (ఆర్థోపెడిక్)
డా. తేజస్విని, డా. భవిత రాణి (కంటి వైద్యులు)
డా. వరప్రసాద్ (డ్యూటీ డాక్టర్)
ఈ వైద్యుల బృందం కలిసి మెగా మెడికల్ క్యాంపులో పాల్గొన్న 172 మందికి జనరల్ చెకప్ లతో పాటు తగిన వైద్య సహాయం అందించి, ఉచితంగా మందులు పంపిణి చేయడం జరిగింది. ఈ క్యాంపుకు స్థానిక ప్రజలు భారీ ఎత్తున పాల్గొన్నందున మెడ్ యునైటెడ్ వైద్య బృందంతో పాటు మెగా అభిమానులు సైతం హర్షం వ్యక్తం చేశారు. ఇకపై ఇలాంటి మెడికల్ క్యాంపులకు మెగా అభిమానులు మున్ముందు సహకరిస్తారని తెలిపారు.