ప్రపంచ ఆరోగ్య దినోత్సవం.. కొత్త లక్ష్యంతో జీవితాన్ని ఆరంభిద్దాం!
ఒకప్పుడు జీవితం అంటే ఎన్నో అంశాలను ప్రస్తావించి చెబుతుండేవారు. జీవితమంటే.. బంధాలు బాంధవ్యాలు, మనుషులు, స్నేహం, డబ్బు, సంతోషం, ఉద్యోగం.. ఇలా ఎన్నో చెప్పేవారు. కానీ, కొన్నాళ్ళుగా ఆరోగ్యానికి సంబంధించి నిర్వచనాలు మారుతూ వచ్చాయి. ఇప్పుడున్న ఆధునిక జీవన విధానాల మధ్య, వేగంగా సాగిపోతున్న కాలాన్ని దృష్టిలో పెట్టుకుని చెప్పుకుంటే.. ఎలాంటి సమస్యకైనా పరిష్కారం వెంటనే లభిస్తుందేమో గానీ, ఆరోగ్యానికి సంబంధించి సమస్యలు వస్తే మాత్రం ఎవరూ ఏమి చేయలేరు.
ఇప్పుడు అన్నిటికంటే ముఖ్యం ఆరోగ్యం మాత్రమే. వస్తువు పాడైతే.. బాగు చేయించుకునే అవకాశం ఉంటుంది లేదా కొత్త వస్తువు కొనుక్కునే అవకాశం ఉంది. కానీ.. ఒకసారి ఆరోగ్యం పాడైందంటే మాత్రం ఎన్ని చేసినా, ఎంత ఖర్చు పెట్టినా పోయిన ఆరోగ్య పరిస్థితి మాత్రం తిరిగి పొందలేము. అందుకే ఆరోగ్యమే భాగ్యం అన్నారు పెద్దలు. ఆరోగ్యం గురించి ప్రస్తావిస్తూ.. ఆరోగ్యం లేకపోతే జీవితంలో ఎంత సంపద ఉన్నా, ఎన్ని సౌకర్యాలు ఉన్నా ఆనందం ఉండదు. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 7వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఆరోగ్య దినోత్సవాన్ని జరుపుతుంటారు.
1948లో ప్రపంచ ఆరోగ్య సంస్థ(వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ – WHO) స్థాపించిన రోజు. కావున ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవం జరుపుతారు. ఆరోగ్యం అంటే.. కేవలం శారీరకంగా మాత్రమే కాదు.. మానసిక శాంతి, సామాజిక సంబంధాలు కూడా ఇందులో భాగంగానే ఉంటాయి. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం యొక్క ఉద్దేశం ఏంటంటే.. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యం గురించి అవగాహన కల్పించడం మరియు ఆరోగ్య సమస్యలపై చర్చించడం. ప్రతి ఏడాది లాగే ఈ ఏడాది కూడా WHO ఒక థీమ్ ‘ఆనందకరమైన భవిష్యత్ కోసం ఆరోగ్యకరమైన ప్రణాళిక వేయడం’ ప్రకటించింది.
ఈరోజుల్లో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎలా?
మన రోజువారీ జీవితంలో కొన్ని సులభమైన అలవాట్లు మన ఆరోగ్యాన్ని ఎంతో మెరుగుపరుస్తాయి. వాటిలో ముఖ్యమైన అంశాలేంటో ఇప్పుడు చూద్దాం!
- సమతుల్య ఆహారం
- తాజా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు తినాలి
- ప్రాసెస్ చేసిన ఫుడ్, ఆయిల్ ఫుడ్, ఎక్కువ చక్కెర కలిగిన ఆహార పదార్థాలు తగ్గించండి.
- రోజూ 2-3 లీటర్ల నీరు తాగడం మర్చిపోవద్దు
- శారీరక శ్రమ
- రోజూ కనీసం 30 నిమిషాలు నడక, యోగా, లేదా ఏదైనా ఆటలు ఆడండి
- ఒక్కచోటే ఎక్కువసేపు కూర్చోకుండా గంటకు ఒకసారి లేచి, చిన్నగా వాకింగ్ చేయడం మంచిది.
- మానసిక ఆరోగ్యం
- ఒత్తిడిని తగ్గించేందుకు ధ్యానం, శ్వాస వ్యాయామాలు చేయాలి
- ఫ్యామిలీ, స్నేహితులతో సమయం గడపండి, ఒంటరితనం నుండి దూరంగా ఉండండి.
- నిద్ర
- రోజూ 7-8 గంటలు నిద్రపోండి. నిద్ర లేకపోతే శరీరం, మనసు రెండూ బలహీనపడతాయి.
- మెడికల్ చెకప్స్
- క్రమం తప్పకుండా బీపీ, షుగర్, ఇతర ఆరోగ్య పరీక్షలు చేయించుకోండి. సమస్య ఏదైనా ముందుగా గుర్తిస్తే చికిత్స సులభం అవుతుంది.
2025లో కొత్త ఆరోగ్య సవాళ్లు:
మారుతున్న ప్రపంచంతో పాటు ఆరోగ్య సమస్యలు కూడా మారుతూ వస్తున్నాయి.
2025 నుండి రానున్న కాలంలో కొన్ని ముఖ్యమైన సవాళ్లు ఇలా ఉండవచ్చు:
- డిజిటల్ ఒత్తిడి: స్మార్ట్ఫోన్లు, కంప్యూటర్ల వాడకం వల్ల కళ్లు, మెడ నొప్పి, మానసిక ఒత్తిడి పెరుగుతుంది.
- పర్యావరణ కాలుష్యం: గాలి, నీటి కాలుష్యం వల్ల శ్వాసకోశ సమస్యలు, అలర్జీలు ఎక్కువవుతాయి.
- జీవనశైలి: యువతలో షుగర్, బీపీ, ఊబకాయం వంటివి ఎక్కువగా కనిపిస్తున్నాయి.
ఈ సవాళ్లను ఎదుర్కోవడానికి, ఆరోగ్యం గురించి సరైన రీతిలో అవగాహన కల్పించేందుకు ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ఒక గొప్ప అవకాశం. ఆరోగ్యకరమైన జీవనశైలి.. ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
సామాజిక బాధ్యత:
ఆరోగ్యం వ్యక్తిగతమైనది మాత్రమే కాదు, సామాజికమైనది కూడా అని గుర్తుంచుకోవాలి. ఎందుకంటే మీ ఒక్కరి ఆరోగ్యం మాత్రమే కాపాడుకుంటే సరిపోదు కదా.. ఈ 2025లో మనం ఇలా చేయవచ్చు.
- అవగాహన: ఆరోగ్యం, పరిశుభ్రత గురించి ఇతరులకు చెబుతూ ఉండాలి.
- సహాయం: గ్రామాల్లో, నిరుపేద ప్రాంతాల్లో ఆరోగ్య సేవలు అందేలా కృషి చేయాలి.
- పర్యావరణ రక్షణ: చెట్లు నాటడం, ప్లాస్టిక్ తగ్గించడం ద్వారా భూమిని కాపాడుకోవచ్చు.
2025 లక్ష్యం:
ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మనం ఒక లక్ష్యం పెట్టుకొని ముందుకు సాగితే బాగుంటుంది.
ఉదాహరణకు..
- రోజూ 10,000 అడుగులు నడవడం.
- వారానికి ఒక రోజు జంక్ ఫుడ్ పూర్తిగా మానేయడం.
- పర్యావరణాన్ని కాపాడేందుకు ఒక చెట్టు నాటడం.
ఈ చిన్న పనులు మన జీవితంలో, సమాజంలో ఎన్నో మార్పులు తీసుకొస్తాయి.
ఆరోగ్యమే జీవితాన్ని పరిపూర్ణం చేస్తుంది.. ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని మరింత మెరుగ్గా జరుపుకోవడానికి కృషి చేద్దాం. ఆరోగ్యం గురించి అవగాహన కల్పించి, చుట్టూ ఉన్నవాళ్లకు స్ఫూర్తిగా నిలుద్దాం!
*మీ ఆరోగ్యానికి ఎలాంటి సమస్య ఏర్పడినా.. వెంటనే 9851247365 నెంబర్ కి కాల్ చేయండి. మా మెడ్ యునైటెడ్ వైద్య నిపుణులు మీకు తగిన సూచనలు, సలహాలు అందించగలరు.