
వరల్డ్ లివర్ డే ప్రాముఖ్యత మరియు లివర్ సమస్యలు, నివారణ మార్గాలు!
మానవ శరీరంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన అవయవాలలో లివర్(కాలేయం) ఒకటి. శరీరంలో రెండవ పెద్ద అవయవంగా లివర్.. దాదాపు ఐదు వందల కంటే ఎక్కువ ముఖ్యమైన విధులను నిర్వర్తిస్తుంది. లివర్ కి సంబంధించి ప్రతి ఏడాది ఏప్రిల్ 19న ‘ప్రపంచ కాలేయ దినోత్సవం'(వరల్డ్ లివర్ డే)ని జరుపుతుంటారు. ఆ రోజున లివర్ హెల్త్ గురించి అవగాహన కల్పించడానికి, లివర్ సంబంధించిన వ్యాధుల నివారణ మరియు ఆరోగ్యవంతమైన జీవనశైలిని ప్రోత్సహించేందుకు నిర్వహిస్తుంటారు.
ఈ ఏడాది వరల్డ్ లివర్ డేని ‘ఆహారమే ఔషధం'(ఫుడ్ ఈజ్ మెడిసిన్) అనే థీమ్ తో నిర్వహిస్తున్నారు. ఇది సమతుల ఆహారం లివర్ హెల్త్ కి ఎంత ముఖ్యమో తెలియజేస్తుంది. కాగా, ఇప్పుడు ఈ బ్లాగ్ లో లివర్ యొక్క ప్రాముఖ్యత, సాధారణ లివర్ సమస్యలు మరియు లివర్ హెల్త్ ని కాపాడుకునే కీలకమైన అంశాల గురించి చర్చించుకుందాం.
లివర్ యొక్క ముఖ్య విధులు:
- టాక్సిన్స్ ఫిల్టరింగ్: శరీరంలోని విష పదార్థాలను తొలగించడం
- పోషకాల ప్రాసెసింగ్: ఆహారం నుండి పోషకాలను శక్తిగా మార్చడం లేదా నిల్వ చేయడం.
- జీర్ణక్రియలో సహాయం: కొవ్వులను జీర్ణం చేయడానికి బైల్ (పిత్తం) ఉత్పత్తి చేయడం
- విటమిన్లు మరియు ఖనిజాల నిల్వ: విటమిన్లు, ఖనిజాలు మరియు గ్లూకోజ్‌ను నిల్వ చేయడం
- రక్తం గడ్డకట్టడంలో సహాయం: రక్తం గడ్డకట్టడానికి అవసరమైన ప్రోటీన్లను ఉత్పత్తి చేయడం
శరీరంలో లివర్ అనేది అత్యంత ముఖ్యమైన అవయవం. ఎందుకంటే ఇది 60-70% వరకు దెబ్బతిన్నప్పటికీ స్వీయనిర్మాణం చేసుకోగలదు. ఒకవేళ నిర్లక్ష్యం చేస్తే మాత్రం లివర్ సమస్యలు తీవ్రమైన అనారోగ్య సమస్యలకు దారితీస్తాయి.
సాధారణంగా ఎదుర్కొనే లివర్ సమస్యలు:
- హెపటైటిస్: వైరల్ ఇన్ఫెక్షన్ (హెపటైటిస్ A, B, C, D, E) వల్ల లివర్‌లో మంట వస్తుంది. ఇది జాండిస్, అలసట, మరియు ఆకలి తగ్గడం వంటి లక్షణాలకు దారితీస్తుంది.
- ఫ్యాటీ లివర్ డిసీజ్ (MASLD): లివర్ లో కొవ్వు పేరుకుపోవడం వల్ల ఏర్పడుతుంది. ఇది ఊబకాయం, డయాబెటిస్ మరియు అధిక కొలెస్ట్రాల్ కి దారితీస్తుంది.
- సిర్రోసిస్: దీర్ఘకాలిక లివర్ డ్యామేజ్ వల్ల లివర్ లో గాయాలు ఏర్పడి, దాని పనితీరు దెబ్బతింటుంది.
- లివర్ క్యాన్సర్: లివర్ లో ప్రాథమిక క్యాన్సర్ లేదా ఇతర అవయవాల నుండి వ్యాపించిన క్యాన్సర్ రూపంలో కలుగుతుంది.
- ఆల్కహాలిక్ లివర్ డిసీజ్: అధికంగా మద్యం సేవించడం వల్ల లివర్ దెబ్బతింటుంది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నివేదిక ప్రకారం, 2017లో 1.5 బిలియన్ ప్రజలు దీర్ఘకాలిక లివర్ వ్యాధులను ఎదుర్కొన్నారు. అలాగే ప్రతి సంవత్సరం 2 మిలియన్ల మరణాలు లివర్ వ్యాధుల వల్ల జరుగుతున్నాయని తెలిపింది.
ఆహారమే ఔషధం థీమ్:
ఈ ఏడాది లివర్ హెల్త్ విషయంలో ఆహారం అనేది ఎంత బాగా పనిచేస్తుందో గుర్తుచేస్తుంది. సమతుల ఆహారం(పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు మరియు లీన్ ప్రోటీన్లు) లివర్ వ్యాధులను నివారించడంలో, లివర్ పనితీరుని మెరుగుపరచడంలో ఎంతో తోడ్పడుతుంది. ప్రధానంగా మెడిటేరియన్ డైట్ (ఆలివ్ ఆయిల్, చేపలు మరియు తక్కువగా ప్రాసెస్ చేసిన ఆహారం) లివర్ కి ఎన్నో ప్రయోజనాలు అందిస్తాయి. అందువల్ల ఆహారపు అలవాట్లను నియంత్రించడం చాలా ముఖ్యం. అలాగే ఆహారం విషయంలో ఖచ్చితమైన మార్పులు చాలా అవసరం.
లివర్ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎలా?
లివర్ సంరక్షణ కోసం కొన్ని సాధారణ చిట్కాలు పాటించినా సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు.
- సమతుల ఆహారం
- ఎక్కువగా ఆకుకూరలు, పండ్లు (బెర్రీలు, ద్రాక్ష), గింజలు, మరియు ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు కలిగిన చేపలను తినాలి.
- ప్రాసెస్ చేసిన ఆహారాలు, చక్కెర, మరియు సాచురేటెడ్ కొవ్వు పదార్థాలకు దూరంగా ఉండాలి
- కాఫీ, గ్రీన్ టీ, మరియు తాజా పండ్ల రసాలు మరియు బీట్రూట్, అమ్లా జ్యూసులు లివర్ కు మంచివి.
- మద్య సేవించడం తగ్గించాలి
- అధిక మద్యపానం లివర్ ని దెబ్బతీస్తుంది. మహిళలు రోజుకు ఒక పెగ్గు, పురుషులు రెండు పెగ్గులకు మించి తీసుకోకూడదు.
- నియమిత ఆరోగ్య పరీక్షలు
- ఫ్యాటీ లివర్ మరియు ఇతర వ్యాధులను ముందుగా గుర్తించడానికి రెగ్యులర్ లివర్ ఫంక్షన్ టెస్ట్‌లు చేయించుకోవాలి
- వ్యాయామం
- వారానికి కనీసం 150 నిమిషాల మోడరేట్ వ్యాయామం (వాకింగ్, సైక్లింగ్) చేయాలి. లివర్ లో కొవ్వును తగ్గించడమే గాక రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.
- హెపటైటిస్ టీకాలు
- హెపటైటిస్ A మరియు B టీకాలు తీసుకోవడం ద్వారా వైరల్ ఇన్ఫెక్షన్లను నివారించవచ్చు
- ధూమపానం మరియు డ్రగ్స్‌ను తీసుకోకూడదు
- పొగ త్రాగడం మరియు డ్రగ్స్ లివర్ కు హాని కలిగిస్తాయి.
- అధిక బరువుని తగ్గించుకోండి
- ఊబకాయం ఫ్యాటీ లివర్ వ్యాధికి ఒక ప్రధాన కారణం. 5-10% బరువు తగ్గితే.. లివర్ ఫ్యాట్ గణనీయంగా తగ్గిస్తుంది.
వరల్డ్ లివర్ డే అనేది.. మనం లివర్ హెల్త్ కి ఎంత ప్రాధాన్యతని ఇవ్వాలో తెలియజేస్తుంది. సమతుల ఆహారం, వ్యాయామం మరియు ఆరోగ్య పరీక్షల ద్వారా లివర్ ని రక్షించుకోవచ్చు. లివర్ ఆరోగ్యం కోసం తగిన జాగ్రత్తలు పాటించండి మరియు ఇతరులకు అవగాహన కల్పించడంలో సహకరించండి.