శరీరంలో వేడిని తగ్గించేందుకు తప్పక తాగాల్సిన పానీయాలు!
ఎండల కాలంలో శరీరంలో వేడి పెరిగిపోయి డీహైడ్రేషన్, వడదెబ్బ లాంటి సమస్యలు ఆరోగ్యాన్ని కుదిపేస్తుంటాయి. ఇలాంటి పరిస్థితులలో శరీరానికి చల్లదనాన్ని అందించే ఆహారం, పానీయాలు తీసుకోవడం చాలా ముఖ్యం. వేడిని తట్టుకోలేక చాలామంది థంబ్స్ అప్, స్ప్రైట్ లాంటి శీతల పానీయాలు తాగేస్తుంటారు. అవి తాత్కాలికంగా ఉపశమనం కలిగిస్తాయేమో గానీ, ఆరోగ్యానికి మేలు చేయవు. అయితే.. అధిక వేడిలో ఆరోగ్యానికి సహజంగా లభించే పానీయాలు ఎంతో మేలు చేస్తాయి. మరి ఈ మండు వేసవిలో ఆరోగ్యాన్ని కాపాడే నేచురల్ డ్రింక్స్ ఏమున్నాయో చూద్దాం!
నిమ్మరసం (లెమన్ వాటర్)
అత్యంత సులభంగా తయారు చేసుకోగలిగే పానీయాలలో ఇది ఒకటి. ఒక గ్లాసు చల్లని నీటిలో నిమ్మకాయ పిండి, కొద్దిగా తేనె లేదా ఉప్పు కలిపి తాగితే శరీరం హైడ్రేటెడ్‌గా ఉంటుంది. విటమిన్ సి సమృద్ధిగా ఉండే నిమ్మరసం శరీరంలో రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది.
కొబ్బరి నీళ్లు
కొబ్బరి నీరు ప్రకృతి మనకు ప్రసాదించిన ఉత్తమ హైడ్రేషన్ డ్రింక్. ఇందులో ఎలక్ట్రోలైట్స్ ఉండటం వల్ల వేసవిలో చెమటతో కోల్పోయిన శక్తిని తిరిగి పొందడానికి సహాయపడుతుంది. రోజూ ఒక తాజా కొబ్బరి నీరు తాగడం వల్ల ఒంట్లో వేడి తొలగిపోయి చల్లగా ఉంటుంది.
మజ్జిగ (బటర్ మిల్క్)
వేసవిలో మజ్జిగ తాగడం అనేది అత్యుత్తమ ఎంపిక. ఇంట్లోనే సులభంగా పెరుగును నీటితో కలిపి, కొద్దిగా ఉప్పు, జీలకర్ర పొడి, కొత్తిమీర వేసి తయారు చేసుకోవచ్చు. ఇది జీర్ణక్రియను పెంపొందించడమే కాకుండా శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది.
పుచ్చకాయ జ్యూస్(వాటర్ మిలన్)
పుచ్చకాయలో 90% నీరు ఉంటుంది. ఇది వేసవిలో డీహైడ్రేషన్ ని నివారిస్తుంది. పుచ్చకాయ ముక్కలను బ్లెండర్లో వేసి జ్యూస్ తయారు చేసి తాగవచ్చు. రుచి కోసం కొద్దిగా పుదీనా ఆకులు జోడించినా మంచిదే. ఒకవేళ జ్యూస్ లాగా కాకపోయినా ఆహారంగా తీసుకున్నా ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
సబ్జా నీరు (బాసిల్ సీడ్స్ డ్రింక్)
సబ్జా గింజలను నీటిలో నానబెట్టి, వాటిని నిమ్మరసం లేదా రోజ్ సిరప్‌తో కలిపి తాగితే శరీరానికి త్వరగా చల్లదనం లభిస్తుంది. వీటిలో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. కాబట్టి జీర్ణక్రియకు కూడా సహాయపడతాయి.
ఎన్ని పానీయాలు తీసుకున్నా వేసవిలో నీరు ఎక్కువ తాగడం మాత్రం మర్చిపోవద్దు. రోజుకు కనీసం 2-4 లీటర్ల నీరు తాగడం వల్ల శరీరం ఆరోగ్యంగా మరియు చురుకుగా ఉంటుంది. ఇప్పుడు చెప్పిన పానీయాలలో నిమ్మరసం, మజ్జిగ, పుచ్చకాయ జ్యూస్, సబ్జా నీరు అయితే ఇంట్లోనే తేలికగా చేసుకోవచ్చు. మరి ఈ మండు వేసవిలో అధిక వేడిని సహజ సిద్ధమైన పానీయాలతో తరిమికొట్టండి! సంతోషంగా వేసవిని ఆస్వాదించండి!
మరి ఈ వేసవిలో ఆరోగ్య సంరక్షణకు సంబంధించి మా సైట్ లో ఇటీవల పోస్ట్ చేసిన చాలా బ్లాగ్స్ ఉన్నాయి.. గమనించగలరు.
ఇక ఈ వేసవిలో ఆరోగ్య సంరక్షణకు సంబంధించి ఎలాంటి సందేహాలున్నా.. 9851247365 నెంబర్ కి కాల్ చేసి మా మెడ్ యునైటెడ్ వైద్య నిపుణులను సంప్రదించవచ్చు.