చలికాలం వేడి నీటితో స్నానం చేస్తే.. ఎన్ని నష్టాలో తెలుసా?
సాధారణంగా చలికాలం వచ్చిందంటే వాతావరణంలో ఉష్ణోగ్రతలు తీవ్రస్థాయిలో పడిపోతుంటాయి. దీంతో చలి తీవ్రత పెరిగి చలికి వణికిపోతుంటారు. చలి తీవ్రస్థాయికి చేరుకున్నప్పుడు ఏ వయసు వారైనా ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. ముఖ్యంగా చలికాలంలో స్నానం చేయాలంటే అందరూ వేడి నీటినే ఉపయోగిస్తుంటారు. ఎందుకంటే.. చలిలో శరీరానికి వేడి తగలగానే ఎంతో హాయిగా అనిపిస్తుంది. అలాగే వేడి అనేది మానసికంగా ఉల్లాసం కలిగిస్తుంది.
చలికాలంలో స్నానానికి వేడి నీళ్లు ప్రిఫర్ చేయడం వల్ల శరీరానికి సౌకర్యవంతంగా అనిపిస్తుందేమో గానీ.. వేడి నీళ్లతో స్నానం చేయడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ఒకవేళ ముందు నుండే ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వేడి నీళ్ళని ఉపయోగిస్తే మరిన్ని అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకున్నట్లే అవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అసలు చలికాలంలో వేడినీటితో స్నానం చేయడం వల్ల కలిగే నష్టాలేంటో ఇప్పుడు చూద్దాం!
- వేడి నీళ్లతో స్నానం చేయడం వల్ల చర్మం దాని సహజ తేమ గుణాన్ని కోల్పోతుంది. దీంతో చర్మం పొడిబారడం, చికాకు, పగుళ్లు, దురద లాంటి సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది.
- వేడి నీళ్లతో స్నానం చేయడం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరిగి బీపీ పెరిగే అవకాశం ఉంది.
- ముందునుండి బీపీ, గుండె సమస్యలు ఉన్నవారు వేడి నీళ్లను ప్రిఫర్ చేయకపోవడం మంచిది.
- వేడి నీళ్లతో స్నానం చేసాక శరీరం తేలికగా అనిపించినా.. అలసటగా, బలహీనంగా అనిపిస్తుంది.
- వేడి నీళ్లతో తరచూ స్నానం చేయడం వల్ల తలనొప్పి, మూర్ఛ, డీహైడ్రేషన్ మరియు వికారం లాంటి సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది.
వేడి నీటితో స్నానం చేయడం వల్ల కలిగే లాభాలేంటో చూద్దాం!
- వేడి నీటితో స్నానం చేయడం వల్ల శరీరం తేలికపడి.. మానసిక ఒత్తిడి తగ్గుతుంది.
- కండరాల ఒత్తిడి తగ్గి.. శరీరంలో రక్త ప్రసరణ పెరుగుతుంది.
- వేడినీటి స్నానంతో.. చర్మ రంధ్రాలు తెరుచుకుంటాయి. దీంతో చర్మం పరిశుభ్రంగా మారి, ఆక్సిజెన్ లెవెల్స్ పెరుగుతాయి.
- వేడి నీటి స్నానం.. శరీరానికి ఉపశమనం కలిగిస్తుంది. ఒళ్ళు నొప్పుల నుండి రిలీఫ్ లభిస్తుంది.