ప్రపంచవ్యాప్తంగా ప్రతీ ఏడాది డిసెంబర్ 1న ‘ఎయిడ్స్ డే‘ని సెలబ్రేట్ చేస్తుంటారు.
ప్రపంచవ్యాప్తంగా ప్రతీ ఏడాది డిసెంబర్ 1న ‘ఎయిడ్స్ డే‘ని సెలబ్రేట్ చేస్తుంటారు.
ఎయిడ్స్ డే ఉద్దేశం..
HIV పై పోరాటాన్ని గుర్తు చేయడం, ఎయిడ్స్ గురించి ప్రజలకు అవగాహన కల్పించడం, ఎయిడ్స్ బాధితులకు మద్దతుగా నిలవడం మరియు ఎయిడ్స్ కారణంగా మరణించిన వారికి నివాళులు అర్పించడం ‘ఎయిడ్స్ డే‘ యొక్క ముఖ్య ఉద్దేశం.
అసలు HIV శరీరంపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది?
‘HIV'(హ్యూమన్ ఇమ్యునో డెఫిషియన్సీ వైరస్) శరీరంలోని రోగనిరోధక వ్యవస్థపై దాడి చేసి.. శరీరం రోగాలతో పోరాడే శక్తిని క్షీణింపజేస్తుంది.
HIV వైరస్ సోకే కారణాలు..
- రక్షణ లేకుండా సె*క్స్ లో పాల్గొనడం,
- హెచ్ఐవీ ఉన్నవారి సూదులు ఇతరులకు వాడటం,
- హెచ్ఐవీ ఉన్నవారి రక్తాన్ని ఎక్కించడం,
- తల్లిపాలు బిడ్డలకు ఇవ్వడం
- సుఖవ్యాధులు (సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్– STD) ఉంటే వారికి హెచ్ఐవీ రిస్క్ ఎక్కువ.
ఇండియాలో HIV/AIDS కేసులు (2023లో)
ఇండియాలో మొత్తం యాక్టీవ్ కేసులు 25,00,000 ఉన్నట్లు UNAIDS గణాంకాలు చెబుతున్నాయి.
15 ఏళ్లు పైబడిన మహిళలు 11 లక్షల మంది
15 ఏళ్ళు పైబడిన పురుషులు 13 లక్షలకు పైగా..
0-14 ఏళ్ళ పిల్లలు 61000 మంది ఉన్నారని యూఎన్ఏఐడిఎస్ తెలిపింది.
ఇండియా/తెలుగు రాష్ట్రాలలో ఎయిడ్స్ గణాంకాలు?(2021 వరకు)
నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజషన్(NACO) అంచనాల ప్రకారం..
2021లో భారతదేశంలో మొత్తం 24,01,284 మంది హెచ్ఐవి బాధితులు ఉన్నారు.
అత్యధికంగా మహారాష్ట్రలో 3,94,077 కేసులు ఉండగా.. అత్యల్పంగా అండమాన్ నికోబర్ 426, సిక్కిం 468 రాష్ట్రాలలో కేసులు ఉన్నాయి.
ఇక ఆంధ్రప్రదేశ్ లో 3,21,028, తెలంగాణలో 1,55,991 మంది బాధితులు ఉన్నట్లు తెలిపింది.
NACO డాటా ప్రకారం, దేశవ్యాప్తంగా 2011-2021 మధ్య అన్ప్రొటెక్టెడ్ సె*క్స్(రక్షణ లేని) కారణంగా దాదాపు 17,08,777 మంది హెచ్ఐవీ బారినపడ్డారు.
వీరిలో అత్యధికంగా ఏపీలో 3,18,814 హెచ్ఐవీ కేసులు నమోదు కాగా, మధ్యప్రదేశ్ (2,84,577), కర్ణాటక (2,12,982), తమిళనాడు (1,16,536) తర్వాత స్థానాల్లో ఉన్నాయి.
2021 వరకు ఇండియాలో ఎయిడ్స్ కారణంగా 41,968 మరణాలు నమోదు కాగా..
గడిచిన పదేళ్లలో(2011 – 2021) ఎయిడ్స్ మరణాలు 76.5% తగ్గినట్లు NACO తెలిపింది.
ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే..
2021 వరకు ప్రపంచవ్యాప్తంగా 3.8 కోట్లకు పైగా హెచ్ఐవీ బాధితులు ఉన్నట్లు WHO గణాంకాలు చెబుతున్నాయి.
ఎయిడ్స్ కారణంగా 6,50,000 మరణాలు నమోదు అయినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) తెలిపింది.
HIV వ్యాప్తికి తీసుకోవాల్సిన చర్యలు..
HIV ని నివారించడానికి కాలానుగుణంగా ఆధునిక పద్ధతులు కూడా ఎంతో అవసరం. ఇప్పటికీ సరైన పరిశోధన, పర్యవేక్షణ లేదు. 2000 నుండి 2010 వరకు ఎలాంటి పద్ధతులు పాటించారో.. ఇప్పటికీ అవే పద్ధతులు పాటిస్తున్నారని నిపుణులు చెబుతున్నారు. ఇక్కడే అర్ధం చేసుకోవచ్చు హెచ్ఐవి విషయంలో జనాలు ఎంతవరకు అప్డేట్ అయ్యారో! కాబట్టి.. హెచ్ఐవి నివారణ పద్ధతులు అప్డేట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
చికిత్స లేదు కాబట్టి కనీస జాగ్రత్తలు..
- కండోమ్(తొడుగు) వాడకం
- యాంటీరెట్రోవైరల్ మందులు(ARD) వాడడం
- సుఖవ్యాధులు రాకుండా చూసుకోవడం
- హెచ్ఐవీ పరీక్షలు, కౌన్సిలింగ్
ఇప్పటిదాకా ‘హెచ్ఐవి కి చికిత్స లేదు. దీనికి నివారణ ఒక్కటే మార్గం‘ఇక యాంటీరెట్రోవైరల్ థెరపీ(ART) ద్వారా వైరస్ ప్రభావాన్ని తగ్గించవచ్చు. దీనికి వైద్యుల సలహా మేరకు యాంటీరెట్రోవైరల్ మందులు(ARD) వాడటం మంచిదని విశ్లేషకులు చెబుతున్నారు.