ఆయువు భరోసా హెల్త్ మెంబర్షిప్ ప్రోగ్రామ్
ఆయువు భరోసా హెల్త్ మెంబర్షిప్ ప్రోగ్రామ్.. 2024 డిసెంబర్ 18న అమలాపురంలో ఘనంగా ప్రారంభమైంది.
ఈ ప్రత్యేక కార్యక్రమం కోనసీమ ప్రజలకు ఆరోగ్య సంరక్షణలో ఒక పెద్ద మార్పును తీసుకురాబోతుంది. పసిపిల్లల నుండి వృద్ధుల వరకు ప్రతీ ఒక్కరి ఆరోగ్యం పట్ల.. రక్షణ కవచంగా, ఈ ప్రోగ్రామ్ నూతన ఉత్తేజాన్ని కలిగించనుంది.
ఆయువు భరోసా ప్రధాన లక్ష్యాలు:
దీని ప్రధాన లక్ష్యం.. కోనసీమ ప్రాంత ప్రజలకు ముందస్తు వ్యాధి నివారణ చర్యలు, నాణ్యమైన చికిత్స, నిరంతర ఆరోగ్య పర్యవేక్షణతో పాటు వైద్య ఖర్చుల భారం తగ్గించడం. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలు తగిన కార్పొరేట్ వైద్య సేవలను తమకు దగ్గరలోని హాస్పిటల్ లో సులభంగా పొందగలుగుతారు.
- వ్యాధి నివారణ
- ఆర్థిక సహాయత
- అత్యుత్తమ వైద్య సేవలు
ఆయువు భరోసా ఎలా మొదలైంది..?
ఆధునిక జీవనశైలిలో నిత్యం ఎన్నో ఆరోగ్య సవాళ్లు ఎదుర్కొంటున్నారు జనాలు. ఆర్థిక చేయూత లేక ప్రజలు పడుతున్న ఇబ్బందులను గుర్తించి “సిఆర్ ట్రస్ట్”.. ఈ ఆరోగ్య సభ్యత్వ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆయువు భరోసాతో కోనసీమ ప్రజలకు సంపూర్ణ ఆరోగ్యం కల్పించే దిశగా సిఆర్ ట్రస్ట్ కృషి చేస్తోంది.
ఈ బృహత్తర కార్యక్రమం.. మెడ్ యునైటెడ్ హాస్పిటల్స్ మరియు కిమ్స్ వైద్య కళాశాల ద్వారా కోనసీమ ప్రాంత ప్రజలకు ఆరోగ్య సభ్యత్వ ప్రయోజనాలను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురాబోతుంది.
ఆయువు భరోసా ఆలోచన ఎవరిది?
విజనరీ లీడర్.. శ్రీ కెవివి సత్యనారాయణ రాజు గారు.. ఆయన్ని కోనసీమ అంతా ప్రేమగా ‘చైతన్య రాజు’ గారు అని పిలుస్తుంది. ఛాన్సలర్‌గా గోదావరి గ్లోబల్ యూనివర్సిటీని, వ్యవస్థాపకుడిగా చైతన్య విద్యాసంస్థలను.. ఆంధ్ర రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలిపారు.
కరోనా మహమ్మారి సమయంలో జరిగిన ప్రాణనష్టం వర్ణనాతీతం.. కొందరికి సరైన వైద్యం అందక, మరికొందరు ఆర్థిక స్తోమత లేక ప్రాణాలు కోల్పోవడాన్ని చూసిన చైతన్య రాజు గారు ఎంతో చలించిపోయారు. ఇకపై డబ్బు లేదనే కారణంతో ఏ ఒక్కరూ ప్రాణాలు కోల్పోకూడదని, కార్పొరేట్ వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావాలనే సంకల్పంతో సిఆర్ ట్రస్ట్ ని ప్రారంభించారు.
అలా చైతన్య రాజు గారి ఆలోచనలో నుండి పుట్టిందే సిఆర్ ట్రస్ట్. ఆ ట్రస్ట్ ద్వారా కోనసీమ ప్రజలకు ఉత్తమ వైద్య సేవలను అందించాలని ఈ ‘ఆయువు భరోసా’ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని రూపొందించారు.
‘ఆయువు భరోసా’ ఏయే హాస్పిటల్స్ లో వర్తిస్తుంది?
ఆయువు భరోసా మెంబర్ షిప్.. కోనసీమ హాస్పిటల్స్ తో పాటు మెడ్ యునైటెడ్ హాస్పిటల్స్, ఆక్సిడెంట్ & ఎమర్జెన్సీ సెంటర్స్, మెడ్ యునైటెడ్ క్లినిక్స్ అన్నిచోట్లా వర్తించనుంది. అత్యాధునిక టెక్నాలజీతో కూడిన సౌకర్యాలతో ఈ ఆస్పత్రుల ద్వారా ఉత్తమ వైద్య సేవలు అందించనుంది.
24/7 వైద్యుల పర్యవేక్షణ, వినూత్నమైన ఆరోగ్య సంరక్షణ పరికరాలు, ఆర్థోరిథం డ్రైవ్ ఫ్లాట్ ఫార్మ్స్, సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన నాణ్యమైన వైద్య సంరక్షణ మరియు కమాండ్ సెంటర్ పర్యవేక్షణలో అనునిత్యం మెరుగైన వైద్య సేవలు అందించనున్నారు.
ఆయువు భరోసా ప్రయోజనాలు ఏంటి?
– 75 ఏళ్ళ వరకు అందరూ అర్హులే
– సభ్యత్వం పొందిన వెంటనే ఎలాంటి వెయిటింగ్ పీరియడ్ లేకుండా అన్ని వైద్య సేవలు
– ప్రతి మెంబర్ కి ఏడాదికి రూ. 5 లక్షల నుండి రూ. కోటి వరకు వైద్య ఖర్చుల భారాన్ని తగ్గిస్తుంది
– IP సేవలపై 100% వరకు తగ్గింపు
– దీర్ఘకాలిక వ్యాధులకు తగు చికిత్స
– ఉచిత OP సేవలు
– ల్యాబ్ టెస్టులపై 50% వరకు తగ్గింపు
– మందులపై 20% తగ్గింపు
ఇవేగాక..
– పికప్ నుండి పునరావాసం వరకు నిరంతర వైద్యసేవలు
– ఇంటివద్దకే హోమ్ కేర్ సేవలు
– మెడిసిన్స్ హోమ్ డెలివరీ
– ఫ్రీ అంబులెన్స్ పికప్ సర్వీస్
– ఫిజియోథెరపీ
వీటన్నిటితో పాటు ప్రత్యేకంగా కంటి వైద్యం మరియు దంత వైద్య సేవలు అందించడం జరుగుతుంది.
సాధారణ ఆరోగ్య భీమా కంటే ‘ఆయువు భరోసా’ ఎందుకు ఉత్తమమైనది?
సాధారణ ఇన్సూరెన్స్ పాలసీలో..
– అన్ని వ్యాధులకు కవరేజ్ ఉండదు
– క్లయిమ్ చేయడానికి క్లిష్టమైన పద్ధతులు
– దేనికైనా వెయిటింగ్ పీరియడ్ తప్పనిసరి
– ఏజ్ లిమిట్ తో పాటు రిజెక్షన్స్ ఎక్కువ
– ముందునుండి ఉన్న వ్యాధులకు కవరేజ్ ఉండదు
ఆయువు భరోసాలో..
– 75 ఏళ్ళ వరకు అర్హులే
– దీర్ఘకాలిక వ్యాధులతో పాటు ముందునుండి ఉన్న వ్యాధులను కవర్ చేస్తుంది
– ఎలాంటి వెయిటింగ్ పీరియడ్ లేదు
– రోగికి అవసరమైన హెల్త్ ప్యాకేజీలతో పాటు మరిన్ని విస్తృతమైన కవరేజ్ ల వెసులుబాటు
– సులభతరమైన నగదు లావాదేవీలు
ఆయువు భరోసాలో సభ్యత్వం ఎలా పొందాలి?
ఆయువు భరోసాలో సభ్యత్వం పొందడం చాలా సులభం.. 9996247365 నెంబర్ కి ఒక్క కాల్ చేసి నమోదు చేసుకోవచ్చు. లేదా ayuvubharosa.com వెబ్ సైట్ ని సంప్రదించవచ్చు.