చింతూరులో పిల్లలకు మరియు వెనుకబడిన వారికి సాధికారత:మెడ్ యునైటెడ్ హాస్పిటల్స్ మరియు కాగ్నిటివ్ కేర్ ఫౌండేషన్ ద్వారా మెగా హెల్త్ క్యాంప్ పేదలు మరియు వెనుకబడిన వారికి ఆశాజనకం
చింతూరు ట్రైబల్ ఏరియా లో, విజయవంతంగా హెల్త్ క్యాంప్ నిర్వహించిన కోనసీమ కాగ్నిటివ్ కేర్ ఫౌండేషన్ ట్రస్ట్ మరియు మెడ్ యునైటెడ్ హాస్పిటల్ అమలాపురం
కోనసీమ జిల్లాలో వైద్య సేవల్లో అగ్రగామి గా ఉన్న మెడ్ యునైటెడ్ హాస్పిటల్స్ మరియు కాగ్నిటివ్ కేర్ ఫౌండేషన్ ట్రస్ట్, ఆంధ్ర ప్రదేశ్, చింతూరు ట్రైబల్ ఏరియా లో ఒక ఘనమైన హెల్త్ క్యాంప్ నిర్వహించింది. దీని ముఖ్య ఉద్దేశం స్థానికులకు, మరీ ముఖ్యంగా చిన్న పిల్లలకి వైద్య సేవలు అందించడం.
ఈ హెల్త్ క్యాంప్ లో, దాదాపు 500 పైగా పిల్లలు మరియు పేదలు హాజరయ్యారు. వచ్చిన వారందరికీ రక్త పరీక్ష, కంటి పరీక్ష,ఈ సీ జీ స్క్రీనింగ్,డాక్టర్ తో సంప్రదింపుల తో పాటు ఆరోగ్యానికి సంబంధించి కొన్ని ముఖ్య సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ హెల్త్ క్యాంప్ ఒక సంఘటిత కార్యక్రమం, దీంట్లో మెడ్ యునైటెడ్ హాస్పిటల్స్ తో పాటు టెక్ సోఫీ, ట్రోవిటి, మరియు గాయత్రి లాబ్స్ నుండి నిపుణులైన సిబ్బంది హాజరయ్యారు.
ఇందులో, చింతూరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి శ్రీ కావూరి చైతన్య గారు, జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డా .పుల్లయ్య గారు, డి ఎం హెచ్ ఓ కార్యాలయం నుండి మెడికల్ ఆఫీసర్ డా. ఉదయ్, టెక్ సోఫీ కంపెనీ యొక్క సీ ఈ ఓ శ్రీ కళ్యాణ్ వర్మ గారు, మరియు ప్రముఖ మెడికల్ ఒంకాలజిస్ట్ శ్రీ డా. ఏ వీ ఎస్ సురేష్ గారు లాంటి ప్రముఖులు హాజరయ్యారు.
టెక్ సోఫీ కంపనీ ముఖ్య కార్య నిర్వహణ అధికారి శ్రీ కళ్యాణ్ వర్మ గారు మాట్లాడుతూ ” సమాజానికి ఉత్తమ వైద్య సేవలు అందించే సద్దుదేశం తో జరిగిన ఈ కార్యక్రమం లో భాగమైనందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది, అందరూ కలిసి ముందుకు వచ్చి చేసిన ఈ ప్రయత్నం మా హృదయాలను తాకింది” అన్నారు.
ఈ హెల్త్ క్యాంప్..అవసరమైన వైద్య సేవలు అందించడం తో పాటు, అక్కడ ప్రజలు స్థానికంగా ఎదుర్కుంటున్న ఆరోగ్య సమస్యలని పరిష్కరించే దిశలో ఒక ముఖ్యమైన వేదిక గా నిలిచింది.సిబ్బంది, హాజరైన ప్రజల తో మాట్లాడం ద్వారా, చర్చించడం ద్వారా వారు ఇకపై మెరుగైన ఆరోగ్యం తో జీవించడానికి కావాల్సిన సమాచారం మరియు జ్ఞానం అందించగలిగారు.
జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి,చింతూరు, డా.పుల్లయ్య గారు మాట్లాడుతూ ” ఇందులో హాజరైన, తమ సహకారం అందించి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు, అందరం కలిసి ఇక్కడి స్థానికుల ఆరోగ్యం మరియు జీవితాలలో చెప్పుకోదగ్గ మార్పు నీ తీసుకొచ్చాం” అన్నారు.
‘అన్ని వర్గాల వారికి మెరుగైన వైద్యం అందుబాటులో ఉండాలి’ అనే ప్రధాన లక్ష్యం తో మెడ్ యునైటెడ్ హాస్పిటల్స్ , భవిష్యత్తు లో కూడా ఇలాంటి మరిన్ని సేవలు, కార్యక్రమాలు అందించడానికి అంకిత భావం తో ముందుకెళ్తోంది.